పార్లమెంటులో విపక్షాల తీరుపై ప్రధాని మనస్తాపం.. తమ ఎంపీలతో కలసి ఎల్లుండి నిరాహార దీక్ష!
- ఢిల్లీలో మోదీ, అమిత్ షా భేటీ
- పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరుపై సమీక్ష
- పార్లమెంటులో విపక్షాల తీరుపై మోదీ విచారం
అమిత్ షా సహా బీజేపీ ఎంపీలతో కలిసి ఈ నెల 12న నిరాహార దీక్ష చేయాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇటీవల పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరుపై విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీ ఎంపీలు ఢిల్లీలో నిరసనలు కూడా తెలిపారు. దీంతో మోదీ సర్కారుపై దేశంలోని పలు పార్టీల నేతలు మండిపడ్డారు.