Narendra Modi: పార్లమెంటులో విపక్షాల తీరుపై ప్రధాని మనస్తాపం.. తమ ఎంపీలతో కలసి ఎల్లుండి నిరాహార దీక్ష!

  • ఢిల్లీలో మోదీ, అమిత్‌ షా భేటీ
  • పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరుపై సమీక్ష
  • పార్లమెంటులో విపక్షాల తీరుపై మోదీ విచారం
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరుపై వారు సమీక్షించారు. పార్లమెంటులో విపక్షాల తీరుపై మనస్తాపం చెందిన మోదీ.. ఒక్క రోజు దీక్ష చేయాలనుకుంటోన్న ఆలోచనపై ఈ సమావేశంలో స్పష్టతకు వచ్చారు.

అమిత్ షా సహా బీజేపీ ఎంపీలతో కలిసి ఈ నెల 12న నిరాహార దీక్ష చేయాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇటీవల పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరుపై విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీ ఎంపీలు ఢిల్లీలో నిరసనలు కూడా తెలిపారు. దీంతో మోదీ సర్కారుపై దేశంలోని పలు పార్టీల నేతలు మండిపడ్డారు. 
Narendra Modi
amith shah
BJP
New Delhi

More Telugu News