narasimharaju: ఆర్ధిక పరమైన సమస్య వుంది .. మా నాన్న 70 ఎకరాలు అమ్మేశారు!: నరసింహరాజు

  • మా నాన్నకి భక్తి ఎక్కువ 
  • దానధర్మాలు చేసేవారు 
  • అలా ఆస్తిపాస్తులు కరిగించేశారు
నరసింహరాజు 100కి పైగా సినిమాల్లో .. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. అలాంటి ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా'లో మాట్లాడారు. "ఆర్థికపరమైన ఇబ్బందులను ఎప్పుడైనా ఫేస్ చేశారా?" అనే ప్రశ్న ఆయనకి  ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. "ఆర్థికపరమైన ఇబ్బందులను అప్పుడే కాదు .. ఇప్పుడూ ఫేస్ చేస్తూనే వున్నాను" అన్నారు.

"మా నాన్నగారికి భక్తి ఎక్కువ. మా ఊరికి ఏ స్వాములు వచ్చినా ఆయనతో పాటు శిష్యులను ఆహ్వానించేవారు. అలా ప్రతిరోజు 60 .. 70 మంది మా ఇంట్లో భోజనాలు చేసేవారు. ఈ కారణంగా 70 ఎకరాల వరకూ అమ్మేశారు. ఆ రోజుల్లో ఎకరం 8 .. 9 వేలు ఉండేది. ఇప్పుడు 80 .. 90 లక్షలు వుంది. అంత ఆస్తి పోయిందనే బాధకన్నా, ఒక నటుడిగా ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నందుకు సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చారు.  
narasimharaju

More Telugu News