narasimharaju: ఎన్టీఆర్ .. ఏఎన్నార్ వల్ల నాకు అవకాశాలు తగ్గాయనడంలో నిజం లేదు: నరసింహరాజు

  • ఎన్టీఆర్ .. ఏఎన్నార్ నన్నెంతో అభిమానించారు
  • వాళ్ల వలన నాకు ఎలాంటి అన్యాయం జరగలేదు
  • ఈ విషయంపై జనంలో వున్నది అపోహ మాత్రమే  

         

ఒక వైపున సాంఘిక చిత్రాలతోను .. మరో వైపున జానపద చిత్రాలతోను నరసింహరాజు అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే గోదావరి జిల్లాల్లో తుపాను రావడం .. ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు కలిసి విరాళాలు వసూలు చేయడం జరిగింది. అదే సమయంలో వాళ్లను విమర్శిస్తూ నరసింహరాజు మాట్లాడాడంటూ అప్పట్లో వార్తలు షికారు చేశాయి.

ఆ తరువాత నరసింహరాజుకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అందుకు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లు కారణమనే ప్రచారం కూడా జరిగింది. ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వచ్చింది. అప్పుడు నరసింహరాజు మాట్లాడుతూ "నేను ఏదో అనేశాననే ప్రచారం జరిగినా .. ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు నన్ను అభిమానించారేగానీ, నాకు చెడు చేయలేదు. ఆ తరువాత ఏఎన్నార్ తో కలిసి నేను 3 సినిమాలు కూడా చేయడం జరిగింది. వాళ్ల వలన నాకు అన్యాయం జరిగిపోయిందనే అపోహ జనంలో వుంది. అది అపోహనే గానీ .. అందులో నిజం లేదు .. ఎవరివలనా నాకు ఎలాంటి ద్రోహమూ జరగలేదు" అని చెప్పుకొచ్చారు.         
narasimharaju

More Telugu News