nanak shah fakir: వివాదాస్పద ‘నానక్ షా ఫకీర్’ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

  • సెన్సార్ బోర్డు అనుమతించిన తర్వాత అడ్డుపడే హక్కు ఎవరికీ లేదు
  • ఈ నెల 13న దేశవ్యాప్తంగా సినిమా విడుదలకు అనుమతి
  • ప్రదర్శనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశం
వివాదాస్పద చిత్రం ‘నానక్ షా ఫకీర్’ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ నెల 13న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ సినిమా విడుదలకు కఠిన ఆంక్షలు విధించిన సిక్కుల అత్యున్నత సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

ఈ సినిమా సిక్కుల తొలి గురువు గురునానక్ దేవ్ జీవితం, మత బోధనలపై తెరకెక్కించినది. రిటైర్డ్ నేవీ అధికారి హరీందర్ ఎస్ సిక్కా నిర్మించారు. సినిమా విషయంలో కొన్ని వర్గాల ఆంక్షలకు వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం విచారించింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఒక్కసారి సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసిన తర్వాత ఈ విషయంలో అడ్డుపడే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ సినిమా ప్రదర్శనలు సజావుగా జరిగేందుకు వీలుగా శాంతి, భద్రతల పర్యవేక్షణపై దృష్టి పెట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.  
nanak shah fakir
movie

More Telugu News