number plate: ప్రపంచంలోనే ఖరీదైన నంబర్ ప్లేట్... ధర రూ.132 కోట్లు మాత్రమే!

షార్ట్స్‌లో చూడండి
మనదేశంలో కొన్ని రకాల వాహన నంబర్లకు మంచి క్రేజీ ఉందన్న విషయం తెలిసే ఉంటుంది. ఒక్కో నంబర్ కు రూ.లక్షలు పలికిన సందర్భాలున్నాయి. అయితే, వీటికి తలదన్నే ఓ నంబర్ ప్లేట్ ‘F1’ ను దాని యజమాని అఫ్జల్ ఖాన్ బ్రిటన్ లో వేలానికి పెట్టాడు. దీనికి రూ.132 కోట్లుగా ధర నిర్ణయించాడు. ప్రపంచంలో ఓ నంబర్ ప్లేట్ కు ఇంత ధర నిర్ణయించడం ఇదే మొదటిసారి.

బుగట్టి వేరాన్ కు చెందిన స్పోర్టీ వాహనానికి  ఈ నంబర్ ప్లేట్ ఉంది. ఈయన ఓ డిజైన్ సంస్థకు యజమాని. దీన్ని గతంలో ఖాన్ కేవలం 10.52 కోట్లకు కొనుగోలు చేశాడు. దాన్నిప్పుడు రూ.110 కోట్లకు విక్రయించాలనుకుంటున్నాడు. దీనికి వ్యాట్ ఇతర పన్నులు, ట్రాన్స్ ఫర్ ఫీజు కలుపుకుంటే రూ.132 కోట్లు అవుతుంది. బ్రిటన్ లో నంబర్ ప్లేట్లను తిరిగి విక్రయించుకునేందుకు అనుమతి ఉంది.
Go Back to Shorts
number plate
auction

More Telugu News