kesineni nani: మోదీకి మాటలు చెప్పడం బాగా అలవాటైపోయింది: కేశినేని నాని

  • హోదా కోసం ఎంత వరకైనా పోరాడుతాం
  • గత నాలుగేళ్లలో మోదీని ఎదిరించిన ఏకైక పార్టీ టీడీపీ
  • వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు పెద్ద డ్రామా
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా పోరాడతామని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీకి మాటలెక్కువ, పని తక్కువ అని ఎద్దేవా చేశారు. ఆయనకు మాటలు చెప్పడం అలవాటై పోయిందని ఆయన విమర్శించారు. గడచిన నాలుగేళ్లలో మోదీని ఎదిరించిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ నేతల రాజీనామాలు పెద్ద డ్రామా అని ఆయన చెప్పారు. ఎంపీలు రాజీనామా చేస్తే, పార్లమెంటులో ఎవరు పోరాడుతారని ప్రశ్నించిన ఆయన, హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగదని ఆయన చెప్పారు. 
kesineni nani
Telugudesam
Vijayawada

More Telugu News