YSRCP: 'మీరు వస్తారని అనుకోలేదు... విజయవాడ సీటుపై ఎవరికీ హామీ ఇవ్వలేదులే': ఏకాంత భేటీలో యలమంచిలి రవితో వైఎస్ జగన్!

  • గుంటూరు జిల్లాలో సాగుతున్న జగన్ పాదయాత్ర
  • యలమంచిలి రవితో భేటీ
  • తన రాకతో ఇప్పటికే ఉన్న నేతలకు ఇబ్బందన్న రవి
  • ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదన్న జగన్
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌తో విజయవాడ తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే యులమంచిలి రవి ఏకాంతంగా భేటీ కాగా, జగన్ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. "మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అనుకోలేదని, వచ్చినందుకు కృతజ్ఞతలు" అని జగన్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.

తాను వైకాపాలోకి వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే సీటును ఆశిస్తున్న ఆశావహులకు ఇబ్బంది కలుగుతుందేమోనని రవి ప్రస్తావించగా, ఇప్పటివరకూ ఎవరికీ ఎటువంటి కమిట్‌ మెంట్‌ ను తాను ఇవ్వలేదని జగన్‌ స్పష్టం చేసినట్టు వైకాపా వర్గాలు వెల్లడించాయి.ఈ నెల 14న శనివారం నాడు జగన్ పాదయాత్ర విజయవాడకు చేరనుండగా, తన అనుచరులతో వచ్చి యలమంచిలి రవి వైకాపాలో చేరనున్నారు. టీడీపీలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రవి వ్యాఖ్యానించారు.
YSRCP
Vijayawada
Jagan
yalamanchili ravi

More Telugu News