Vijayawada: చంద్రబాబు రంగంలోకి దిగినా మెత్తబడని యలమంచిలి రవి... 14న జగన్ సమక్షంలో వైకాపాలోకి!
- విజయవాడలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ
- కార్యకర్తల కోరిక మేరకు వైసీపీలోకి రవి
- చంద్రబాబు న్యాయం చేయడం లేదని మనస్తాపం
విజయవాడలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగలనుంది. ఆ పార్టీ నేత, నగర తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14న ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారని తెలుస్తోంది. ఆయన్ను బుజ్జగించేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగినా ఫలితం లేకపోవడం గమనార్హం.
గత వారంలో యలమంచిలి రవిని తన కార్యాలయానికి పిలిపించుకున్న చంద్రబాబునాయుడు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. న్యూఢిల్లీ నుంచి రాగానే మరోసారి మాట్లాడతానని చెప్పారు. చంద్రబాబుతో చర్చించిన రోజు తాను పార్టీ మారడం లేదని చెప్పిన రవి, వారం తిరగకుండానే మనసు మార్చుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత చంద్రబాబు నుంచి ఎటువంటి కబురూ రాకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. కార్యకర్తల కోరిక మేరకు తాను వైసీపీలో చేరుతున్నట్టు రవి తెలిపారు.