Maharashtra: ఖండాలా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది మృతి

షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఖండాలా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వేగంగా దూసుకెళ్లిన డీసీఎం వ్యాన్ రోడ్డుకు రక్షణగా వేసిన రెయిలింగ్‌ ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, హుటాహుటీన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.  
Go Back to Shorts
Maharashtra
khandala
road accident

More Telugu News