ipl: చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్... కీలక ఆటగాడు దూరం

షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తొలి మ్యాచ్ లో విజయాన్ని అందించిన ఆల్‌ రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ ఐపీఎల్ కు దూరమయ్యాడు. కేదార్ జాదవ్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7.8 కోట్లకు కొనుగోలు చేసింది. జట్టు కోరుకున్నట్టే ముంబై ఇండియన్స్ తో జరిగిన ఆరంభ మ్యాచ్ లో ఓపెనర్‌ గా క్రీజులోకి దిగిన కేదార్ జాదవ్‌ తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌ గా వెనుదిరిగాడు.

కీలక దశలో మళ్లీ క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్, చివరి ఓవర్ లో విజయానికి 7 పరుగులు కావాల్సి ఉండగా, సిక్స్‌, ఫోర్‌ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఆ గాయం పెద్దది కావడంతో టోర్నీ నుంచి కేదార్ జాదవ్ దూరమయ్యాడని కోచ్ మైకేల్ హసీ తెలిపాడు. ఇది తమ జట్టుకు పెద్ద నష్టమని పేర్కొన్నాడు.
Go Back to Shorts
ipl
chennai super kings
kedar jadhav

More Telugu News