Salman Khan: భాయ్.. నువ్వు మరింతగా ప్రకాశించాలి!: సల్మాన్ సోదరి అర్పిత

  • అర్పితాఖాన్ శర్మ భావోద్వేగ పోస్ట్
  • తన బలం, బలహీనత సల్మానేనన్న అర్పిత
  • సల్మాన్ విజయాన్నిఓర్వలేని వారు చల్లగా ఉండాలంటూ పోస్ట్
కృష్ణ జింకల వేట కేసులో ఐదేళ్ల శిక్షకు గురైన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో రెండు రోజులు ఉన్నాడు. అనంతరం బెయిలుపై విడుదలయ్యాడు. ప్రస్తుతం ముంబైలోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న సల్మాన్ త్వరలోనే షూటింగులకు హాజరుకానున్నాడు.

సల్మాన్ విడుదలపై ఆయన సోదరి అర్పితా ఖాన్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. సల్మానే తన సర్వస్వమని పేర్కొన్న అర్పిత తన బలం, బలహీనత, గర్వం, సంతోషం, జీవితం, ప్రపంచం అన్నీ అతడేనంది. సల్మాన్ విజయాన్ని చూసి ఓర్వలేని వారు చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొంది. వారి చెడు దృష్టి పడకుండా సల్మాన్ సంతోషంగా ఉండాలని, మరింత ప్రకాశవంతం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు రాసింది. 'నీ మంచి పనులు, విజయాలు నిన్ను ద్వేషించే వారిని కనపడకుండా చేయాలని' వేడుకుంటూ చివరల్లో ‘ఐ లవ్యూ భాయ్’ అని ముగించింది. అర్పిత పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Salman Khan
arpitha khan
Bollywood

More Telugu News