jc divakar reddy: హోదాపై పోరాటం వల్ల ఉపయోగం లేదు.. బాబును కాదనలేకే పోరాటం: జేసీ

  • మోదీ హోదా ఇవ్వరు
  • హోదాపై పోరాటం మొత్తం బూడిలో పోసిన పన్నీరే
  • ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే రాష్ట్ర ప్రజలను ఒప్పిస్తాం 
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై పోరాడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం చేసే పోరాటం మొత్తం బూడిదలో పోసిన పన్నీరేనని స్పష్టం చేశారు. ఈ వాస్తవం తనకు తెలిసినా, పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు ఆదేశాన్ని శిరసావహిస్తూ హోదా పోరాటంలో భాగమవుతున్నానని ఆయన చెప్పారు.

మోదీ మొండి వైఖరి తెలిసినందువల్లే తానీరకంగా మాట్లాడుతున్నానని, ఆయన హోదా ఇవ్వరని జేసీ తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా కాకున్నా, హోదాకి సమానమైన ప్యాకేజీ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. చాలినన్ని నిధులు ఇస్తే, రాష్ట్ర ప్రజలను ఒప్పించే బాధ్యత తమదని ఆయన కేంద్రానికి స్పష్టం చేశారు. 
jc divakar reddy
Telugudesam
Narendra Modi
BJP
Special Category Status

More Telugu News