Agri Gold: అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. చేతులెత్తేసిన ఎస్సెల్-జీ గ్రూపు

షార్ట్స్‌లో చూడండి
అగ్రిగోల్డ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆ సంస్థ ఆస్తులను టేకోవర్ చేయడానికి ముందుకొచ్చిన ఎస్సెల్-జీ గ్రూపు తమ వల్ల కాదని చేతులెత్తేసింది. సంస్థ ఆస్తులు రూ.2,500 కోట్లు ఉండగా, అప్పులు మాత్రం రూ.10 వేల కోట్లుగా తేలడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. టేకోవర్ అంశాన్ని పునరాలోచిస్తామని ఎస్సెల్-జీ గ్రూప్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది కాబట్టి, ఆస్తులను కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని బాధితులకు బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టును కోరారు. కాగా, ఈ అంశంపై నిర్ణయం కోసం తమకు రెండు వారాల గడువు ఇవ్వాలని స్పెషల్ జీపీ కృష్ణ ప్రకాశ్ కోర్టును కోరారు. అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.
Go Back to Shorts
Agri Gold
Andhra Pradesh
Take Over

More Telugu News