JC Diwaka Reddy: పవన్ నాకు ఆఫర్ ఇచ్చారు.. జేసీ సంచలన వ్యాఖ్యలు

  • కొందరు దూతలను పంపి పార్టీలోకి ఆహ్వానించారు
  • పార్టీ మారేది లేదని తెగేసి చెప్పాను
  • ఓ ఇంటర్వ్యూలో టీడీపీ సీనియర్ నేత
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి రావాలంటూ తనను ఆహ్వానించారని పేర్కొన్నారు. అయితే, ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించానన్నారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరపున కొందరు నేతలు తన వద్దకు వచ్చి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారన్నారు. వారి ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని, పార్టీ మారేది లేదని తేల్చి చెప్పానన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో జనసేన గల్లంతవడం ఖాయమన్నారు. వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి తమ రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయిస్తే తాను కూడా రాజీనామా చేస్తానన్నారు. జనసేన చీఫ్ తనను ఆహ్వానించారన్న దివాకర్ రెడ్డి వ్యాఖ్యలతో పవన్ కూడా ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలు పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
JC Diwaka Reddy
Pawan Kalyan
Jana sena
Telugudesam

More Telugu News