Chiranjeevi: ప్రభాస్ తో నిహారిక పెళ్లి వార్తలను ఖండించిన చిరంజీవి: జీ న్యూస్

  • ప్రభాస్ తో నిహారిక పెళ్లి అంటూ కథనాలు
  • ఇవన్నీ అవాస్తవాలన్న చిరంజీవి
  • జీ న్యూస్ లో కథనం
'బాహుబలి'తో నేషనల్ స్టార్ గా ఎదిగిన టాలీవుడ్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన తదుపరి సినిమాపై ఎంత చర్చ జరుగుతోందో... అంతే స్థాయిలో ఆయన పెళ్లిపై కూడా చర్చ జరుగుతోంది. తాజాగా చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారికతో ప్రభాస్ వివాహం జరగబోతోందంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలన్నీ అబద్దాలే అంటూ జాతీయ మీడియా సంస్థ జీ న్యూస్ తెలిపింది. ఈ వార్తలను చిరంజీవి ఖండించారని, ఈ వార్తలన్నీ అవాస్తవమేనంటూ ఓ కథనాన్ని ప్రచురించింది.

హీరోయిన్ అనుష్కను ప్రభాస్ పెళ్లాడబోతున్నాడనే వార్తలు కూడా ఇంతకు ముందు హల్ చల్ చేశాయి. అయితే, ఆ వార్తలను ప్రభాస్, అనుష్కలు ఇద్దరూ ఖండించారు. ప్రస్తుతం 'సాహో' చిత్రంతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖర్జీ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరాబేడీ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Chiranjeevi
Prabhas
Niharika
marriage

More Telugu News