Salman Khan: మీ ఆదరాభిమానాలకు కన్నీరు పెట్టుకుంటున్నాను: సల్మాన్‌ ఖాన్‌

  • కృష్ణజింకలను చంపిన కేసులో సల్మాన్‌కు బెయిల్‌
  • ట్వీట్‌ చేసిన బాలీవుడ్‌ కండల వీరుడు
  • 'మీరు చూపెడుతోన్న ప్రేమకు, ఇస్తోన్న మద్దతుకు థ్యాంక్స్‌'
అభిమానులు తనపై చూపెడుతోన్న ఆదరాభిమానాలకి కృతజ్ఞతతో కన్నీరు పెట్టుకుంటున్నానని బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ అన్నాడు. తన పట్ల అభిమానులు చూపెడుతోన్న ప్రేమకు, తనకు ఇస్తోన్న మద్దతుకు తాను థ్యాంక్స్‌ చెబుతున్నానని ట్వీట్ చేశాడు. కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. శిక్ష పడిన వెంటనే ఆయన తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశాడు. జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో రెండు రోజులు ఉన్న సల్మాన్‌ కి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యాడు.   
Salman Khan
Twitter
Bollywood

More Telugu News