polavaram: పోలవరం ప్రాజెక్ట్ అప్ డేట్స్!

  • పోలవరం పనులు 52.10 శాతం పూర్తి
  • కుడి ప్రధాన కాలువ 89.10, ఎడమ ప్రధాన కాలువ 58.30 శాతం పూర్తి
  • చంద్రబాబుకు వివరించిన అధికారులు  
ఏపీ ప్రజలకు అత్యంత ప్రధానమైన పోలవరం ప్రాజెక్టుతో పాటు వివిధ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల పురోగతిపై ఆయన వర్చువల్ ఇన్స్ పెక్షన్ చేశారు. పోలవరం పనులు ఇప్పటి వరకు 52.10 శాతం పూర్తయ్యాయని ఈ సందర్భంగా చంద్రబాబుకు అధికారులు తెలిపారు. కుడి ప్రధాన కాలువ 89.10 శాతం, ఎడమ ప్రధాన కాలువ 58.30 శాతం పూర్తయిందని చెప్పారు. స్పిల్ వే, స్పిల్ చానల్ తవ్వకం పనులు 71.10 శాతం పూర్తయ్యాయని తెలిపారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు 13.80 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. 79.40 శాతం వరకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58 శాతం, జెట్ గ్రౌండింగ్ 58.06 శాతం పూర్తయినట్టు చెప్పారు.        
polavaram
Chandrababu
virtual inspection
works

More Telugu News