poori: ఢిల్లీలో నిరాహార దీక్ష చేసే ముందు కడుపు నిండా పూరీలు తిన్న కాంగ్రెస్ నేతలు.. ఫొటోలు

షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఖండిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఈ రోజు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద జరుగుతోన్న ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

కాగా, ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్‌లో నిరాహార దీక్షకి వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు హోటల్‌లో పూరీలు తింటూ మీడియాకు చిక్కారు. ఈ ఫొటో బయటకు రావడంతో కాంగ్రెస్ నేత అరవింద్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ... తాము చేసేది ఒక్కరోజు దీక్ష అని, ఈ రోజు ఉదయం 10.30 నుంచి సాయత్రం 4.30 వరకు ఉంటుందని, తాము ఉదయం 8 గంటల ముందే తింటే తప్పేంటని అన్నారు. బీజేపీ నేతలు దేశాన్ని సమర్థవంతంగా పాలించే అంశంపై దృష్టి పెట్టకుండా, తాము ఏం తింటున్నామనే విషయంపై దృష్టి పెట్టారని విమర్శించారు.  
Go Back to Shorts
poori
Congress
New Delhi

More Telugu News