renuka chowdary: మోదీపై మరోసారి నిప్పులు చెరిగిన రేణుకా చౌదరి

  • మోదీ మహిళా ద్వేషి
  • తల్లిని క్యూలో నిలబెట్టి లాభం పొందాలనుకున్నారు
  • మోదీ సూచన మేరకే మమతను కేసీఆర్ కలిశారు
ప్రధాని మోదీపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మరోసారి విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో మోదీ చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆమె అన్నారు. తాను మహిళా ద్వేషిననే విషయాన్ని మోదీ నిరూపించుకున్నారని అన్నారు. రాజ్యసభలో రేణుక నవ్వడంపై మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 రైతులు, దళితుల పట్ల కూడా మోదీ ద్వేష భావంతో వ్యవహరిస్తున్నారని రేణుక విమర్శించారు. తల్లిని కూల్యో నిలబెట్టి, దాన్నుంచి కూడా లాభం పొందాలనుకున్న వ్యక్తి మోదీ అని ఎద్దేవా చేశారు. మోదీ ఎన్ఆర్ఐ ప్రధాని అని... ఇక్కడ దేశంలో ఎలాంటి సమస్య వచ్చినా, ఆయన స్పందించరని అన్నారు. మోదీ సూచన మేరకే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వద్దకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారని ఆరోపించారు. 
renuka chowdary
Narendra Modi
mamatha banerjee
KCR

More Telugu News