YSRCP: ఏపీకి మరో పదేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : జలీల్‌ఖాన్

  • వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • అదే నేను గెలిస్తే జగన్ రాజకీయాలు వదిలేస్తారా?
  • జగన్ కు ఇదే నా సవాల్
ఏపీకి మరో పదేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి అని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అదే కనుక తాను గెలిస్తే జగన్ రాజకీయాలు వదిలేస్తారా? అని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనకు జగనే కారణమని, కేసుల మాఫీ కోసమే విజయసాయిరెడ్డి మోదీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
YSRCP
Telugudesam
jalilkhan

More Telugu News