YSRCP: వైవీ సుబ్బారెడ్డిని పరామర్శించిన విజయమ్మ

  • సుబ్బారెడ్డికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రికి వెళ్లిన విజయమ్మ
  • ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న నేత
  • విజయమ్మ వెంట ఎమ్మెల్యే రోజా, వైసీపీ నాయకుడు సజ్జల
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో వైవీ సుబ్బారెడ్డికి వైద్య సేవలందిస్తున్నారు. కాగా, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. విజయమ్మతో పాటు ఎమ్మెల్యే రోజా, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎమ్మెల్యే రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జతపరిచారు.
YSRCP
delhi
subba reddy
vijayamma

More Telugu News