Karnataka: చుట్టాల పిల్లలను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన నవ దంపతులు!

  • కర్ణాక రామ్ నగర్ తాలూకాలో ఘోరం
  • ఇద్దరు పిల్లలతో కలసి విహారానికి వెళ్లిన శేఖర్, సుమిత్ర
  • చెరువులో పిల్లలు మునిగిపోతుంటే కాపాడబోయిన దంపతులు
  • ప్రమాదవశాత్తూ నలుగురూ మృతి
కర్ణాటక పరిధిలోని రామ్ నగర్ తాలూకాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చుట్టపు చూపుగా వచ్చి వారి పిల్లలను తీసుకుని వ్యాహ్యాళికి వెళ్లిన నవ దంపతులు, వారిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హనుమంతనగర్ కు చెందిన శేఖర్, సుమిత్రలకు మూడు నెలల క్రితం వివాహం జరుగగా, చిక్కేనహళ్లిలో ఉన్న శేఖర్ బంధువు రాజు ఇంటికి వారిద్దరూ వచ్చారు. ఆపై సమీపంలోని నాగప్ప దేవాలయం సమీపంలోని చెరువు వద్దకు రాజు కుమార్తె హంస (7), కుమారుడు ధనుష్ (6)లను తీసుకుని విహారానికి వెళ్లారు. చెరువులో ఆడుకుంటున్న హంస, ధనుష్ లు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోతుండగా, వారిని కాపాడేందుకు శేఖర్, సుమిత్రలు ప్రయత్నించారు. ఈ క్రమంలో చెరువులో వారు కూడా మునిగి ప్రాణాలు వదిలారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి, మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Karnataka
Newly Married Couple
Ramnagar
Died

More Telugu News