Sri Reddy: శ్రీరెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని అనుకున్నాం: నటుడు ఉత్తేజ్

  • అవకాశం కోసం ఓపికతో ఎదురు చూడాలి
  • ప్రతిభతో పాటు అదృష్టం ఉంటేనే రాణిస్తారు
  • తప్పుడు మార్గంలో వెళ్లి పొరపాటు చేసిన శ్రీరెడ్డి
చలన చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎంతో ఓపికతో ఎదురు చూడాలని, ఇక్కడ రాణించాలంటే ప్రతిభతో పాటు ఎంతో అదృష్టం ఉండాలని నటుడు ఉత్తేజ్ వ్యాఖ్యానించాడు. నటి శ్రీరెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని భావించామని, అయితే, తన అసభ్య ప్రవర్తనతో ఆ అర్హతను ఆమె కోల్పోయిందని చెప్పాడు. దర్శకుడు తేజ సినిమాల్లో నటించి ఉంటే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చేవేమోనని అభిప్రాయపడ్డ ఉత్తేజ్, తను మాత్రం తప్పుడు మార్గంలో వెళ్లి ఎంతో పెద్ద పొరపాటు చేసిందని అన్నాడు. ఆమె ఎంచుకున్న మార్గం సరైనది కాదు కాబట్టే అవకాశాలు రాలేదని చెప్పాడు. ప్రతిభకు తోడు టైమ్ కలిసొస్తే చిత్ర పరిశ్రమలో రాణించవచ్చని చెప్పాడు.
Sri Reddy
Uttej
Tollywood

More Telugu News