New Delhi: ఢిల్లీలో గాలివాన బీభత్సం..కుప్పకూలిన వైసీపీ టెంట్లు!

  • ఏపీ భవన్ లోపల దీక్షను కొనసాగిస్తున్న వైసీపీ ఎంపీలు
  • ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్
  • కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీరు 
ఢిల్లీలో ఈరోజు ఉదయం భారీగా ఈదురుగాలులు వీయడంతో పాటు వర్షం కురిసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలచిపోయింది. వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ ప్రకారం, ఈ రోజంతా వర్షం కురుస్తుందని, పిడుగులు పడే అవకాశాలున్నట్టు తెలిపింది. ఢిల్లీ, దక్షిణ హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. కాగా, ఢిల్లీలో ఈరోజు కురిసిన వర్షం కారణంగా ఏపీ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ దీక్షా శిబిరం టెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో, ఏపీ భవన్ లోపల వైసీపీ ఎంపీలు తమ దీక్ష కొనసాగిస్తున్నారు.
New Delhi
YSRCP

More Telugu News