Chandrababu: తెలుగు తమ్ముళ్లకు శుభవార్త.. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ!

  • కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీకి కసరత్తు
  • ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు
  • ఆతృతగా ఎదురుచూస్తున్న ఆశావహులు
తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సిద్ధమవుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ కోసం కసరత్తు పూర్తి చేసిన ఆయన ఎవరికి ఏ పదవి ఇవ్వాలో ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ఈ వారంలోనే భర్తీ చేయనున్నట్టు పక్కా సమాచారం ఉండడంతో ఆశావహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ నియామకంతోపాటు ఆర్టీసీ, కాపు కార్పొరేషన్, శాప్, ఏపీ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహా మరికొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ఈ నెలలోనే భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్వర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.
Chandrababu
Andhra Pradesh
Telugudesam

More Telugu News