bengaluru: బెంగళూరు ‘మెట్రో’లో ప్రయాణించిన రాహుల్, సిద్ధరామయ్య!

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం కాంగ్రెెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బెంగళూరులో పర్యటించారు. ఈరోజంతా పలు కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. ఈరోజు ఉదయం సీఎం సిద్ధరామయ్యతో కలిసి ‘మెట్రో’లో ప్రయాణించారు. మెట్రో టికెట్ కౌంటర్ వద్ద సిద్ధరామయ్యతో కలిసి రాహుల్ సెల్ఫీ దిగారు. రైలులో ప్రయాణికులను పలకరిస్తూ వారితో కలిసి సెల్ఫీలు దిగారు. రాహుల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆయనతో కలిసి ఫొటోలు దిగేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. అనంతరం, చర్చి స్ట్రీట్ లో ఉన్న ఓ బుక్ స్టాల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ‘ఏ హిస్టరీ ఆఫ్ గాడ్’, ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’, ‘ది గోట్ తీఫ్’ వంటి పుస్తకాలను రాహుల్ కొనుగోలు చేశారు.  
Go Back to Shorts
bengaluru
Rahul Gandhi
siddaramaiah

More Telugu News