cpm madhu: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం దక్కే అవకాశమే లేదు: సీపీఎం మధు జోస్యం

  • కడపలో సీపీఐ ప్రతినిధుల సమావేశానికి హాజరైన మధు
  • ఇన్నాళ్లూ ప్రత్యేకహోదా అంటే చంద్రబాబు ఎగతాళి చేశారు
  • రాష్ట్రానికి బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు నష్టం కలిగించాయి

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం దక్కే అవకాశమే లేదని సీపీఎం నేత మధు జోస్యం చెప్పారు. కడపలో సీపీఐ ప్రతినిధుల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ నేతలు సురవరం సుధారకర్ రెడ్డి, రామకృష్ణ, చాడ వెంకటరెడ్డి, సీపీఎం మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇన్నాళ్లూ ప్రత్యేకహోదా అంటే ఎగతాళి చేసిన చంద్రబాబుకు, ఈరోజున అదే నినాదం తీసుకుంటే తప్ప బాబుకు మనుగడ సాధించలేని పరిస్థితి అని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు తీవ్ర నష్టం కలిగించాయని అన్నారు.

ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదు

ఏపీలో కార్పొరేట్లకు అనుకూలంగా పరిపాలన సాగుతోందని, ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదని ఏపీ అంటే అనంతపురం టూ పార్వతీపురం అనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ  అన్నారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరిస్తూ, వెనుకబడిన ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర మహాసభల్లో పీపుల్స్ అజెండా పెడతామని, చంద్రబాబు, జగన్ పరస్పర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఏపీకి నిజంగా హోదా సాధించాలనే చిత్తశుద్ధి కనుక ఉంటే అందరినీ కలుపుకోవాలని రామకృష్ణ సూచించారు.

More Telugu News