Andhra Pradesh: దేశంలో తొలిసారిగా అమరావతిలో సంతోషనగరాల సదస్సు

  • ఈ నెల 10 నుంచి 12 వరకు మంగళగిరిలో జరగనున్న సదస్సు
  •  27 దేశాల నుంచి హాజరుకానున్న వంద మంది ప్రతినిధులు
  • అమరావతిని సంతోష నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికల రూపకల్పనపై జరగనున్న చర్చ 
గుంటూరు జిల్లా మంగళగిరిలో సంతోష నగరాల సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ శశిధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా అమరావతిలో సంతోషనగరాల సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా ఈ నెల 10 నుంచి 12 వరకు ఈ సదస్సు నిర్వహించనుందని, భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సదస్సుకు 27 దేశాల నుంచి 100  మంది ప్రతినిధులు హాజరుకానున్నారని, ప్రజలు సంతోషంగా ఉండాలంటే చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలపై, అమరావతి సంతోష నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపకల్పనపై చర్చ జరగనుందని, సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసాం చేస్తారని చెప్పారు.
Andhra Pradesh
Chandrababu
amaravathi

More Telugu News