Sri Reddy: నాకింక అవకాశాలు రావు, నటించాలన్న ఆసక్తీ లేదు: నటి శ్రీరెడ్డి

  • ఫిల్మ్ చాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి
  • తెలుగు అమ్మాయిల కోసమే గళమెత్తాను
  • తెలుగు కళామతల్లికి సిగ్గు చేటు
  • ఫేస్ బుక్ ఖాతాలో శ్రీరెడ్డి
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలను కేవలం పడక సుఖం కోసమే వాడుకుంటున్నారే తప్ప అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, నిన్న ఫిల్మ్ చాంబర్ వద్ద అర్థనగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి, తన ఫేస్ బుక్ ఖాతాలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిరసన తరువాత తనకు ఇంక అవకాశాలు రావని, తనకు నటించాలన్న ఆసక్తి కూడా లేదని చెప్పింది. తెలుగు అమ్మాయిల కోసమే తాను గళమెత్తుతున్నానని, ఇప్పటివరకూ తాను టాలీవుడ్ కు చేతనైనంత సేవ చేశానని చెప్పింది. "నన్ను నగ్నంగా నిలబెట్టిన టాలీవుడ్ కు ఇది బ్లాక్ డే. ఇది తెలుగు కళామతల్లికే సిగ్గు చేటు. నా యుద్ధం కొనసాగుతుంది" అని పోస్టు పెట్టింది. తమిళనాడులో జల్లికట్టు తరహాలో తెలుగు హీరోయిన్లకు మద్దతుగా నిరసనలు తెలియజేయాలని కోరింది.
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fiamsrireddy%2Fposts%2F2088516334728621&width=500" width="500" height="250" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true"></iframe>
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fiamsrireddy%2Fposts%2F2088520418061546&width=500" width="500" height="174" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true"></iframe>
Sri Reddy
Facebook
Tollywood
Half Nude Protest

More Telugu News