Jammu And Kashmir: సల్మాన్‌కి బెయిల్‌పై స్పందిస్తూ.. కశ్మీర్‌పై షోయబ్‌ అక్తర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
కశ్మీర్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్‌కు చెందిన మరో మాజీ క్రికెటర్ కూడా ఇదే తీరును ప్రదర్శించాడు. ఈ రోజు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కి బెయిల్‌ మంజూరు కావడం పట్ల షోయబ్ అక్తర్ ట్వీట్ చేస్తూ కశ్మీర్‌ అంశంపై కూడా వ్యాఖ్య అనుచిత వ్యాఖ్య చేశాడు.

ఎట్టకేలకు సల్మాన్‌ ఖాన్‌కి కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని పేర్కొన్న షోయబ్ అక్తర్.. అలాగే, తన జీవితంలో ఏదో ఒక రోజు కశ్మీర్‌, పాలస్తీనా, యెమెన్, ఆప్ఘనిస్థాన్‌తో పాటు ప్రపంచంలోని సమస్యాత్మక ప్రాంతాలన్నింటికీ స్వతంత్రం వచ్చిందనే వార్త వినాలని ఉందని అన్నాడు. ఎందుకంటే మానవత్వం లేమితో ప్రవర్తించడం, అమాయకుల ప్రాణాలు తీయడం వంటి చర్యలు తన హృదయాన్ని పిండేస్తున్నాయని చెప్పుకొచ్చాడు.    
Go Back to Shorts
Jammu And Kashmir
Shoaib Akhtar
Twitter

More Telugu News