KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి మరో అంతర్జాతీయ అహ్వానం

  • రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ నుంచి ఆహ్వానం
  • మే 24 నుంచి ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశం 
  • ప్రసంగించాలని కేటీఆర్‌ను కోరిన నిర్వాహకులు
ఇప్పటికే విదేశాల్లో పలు సమావేశాలకు హాజరై ప్రసంగించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు తాజాగా మరో అంతర్జాతీయ అహ్వానం లభించింది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ లో జరగనున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌ లో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఈ ఏడాది మే 24 నుంచి 26 వరకు జరిగే ఈ సమావేశంలో ప్రపంచ వాణిజ్య వేత్తలు, పలు దేశాల ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొని అంతర్జాతీయ అర్థిక వ్యవస్థ గురించి చర్చిస్తారు.

ఈ సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య ప్రాధాన్యతలు, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ పాలసీలపై వివరించాలని కేటీఆర్‌ను నిర్వాహకులు కోరారు. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌ నుంచి తనకు అహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.  
KTR
Russia
Telangana

More Telugu News