vishnu kumar raju: సీబీఐ విచారణకు లేఖ రాస్తాం: విష్ణు కుమార్‌ రాజు

  • పట్టిసీమలో అవినీతి
  • చంద్రబాబు సమాధానం చెప్పాలి
  • లేదంటే ఊరుకోం
పట్టిసీమ ప్రాజెక్టులోని వివిధ అంశాల్లో అవినీతి జరిగిందని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. తాము అఖిలపక్ష సమావేశానికి రాలేకపోవడంపై విష్ణు కుమార్ రాజు ఈ రోజు చంద్రబాబు నాయుడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ... ఆ లేఖలో పట్టిసీమ అంశాన్ని కూడా లేవనెత్తినట్లు చెప్పారు. చంద్రబాబు స్పందించని పక్షంలో తాము సీబీఐ విచారణకు లేఖ రాసే అంశాన్ని ఆలోచిస్తామని విష్ణు కుమార్ రాజు అన్నారు. కాగా, శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. 
vishnu kumar raju
bjp
pattiseema

More Telugu News