bjp: బీజేపీ ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయదు: పురందేశ్వరి

  • 2014 ఎన్నికల్లో తామిచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతాం
  • బీజేపీపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది
  • ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే బెటర్
బీజేపీ ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయదని భారతీయ జనతా పార్టీ నేత పురందేశ్వరి అన్నారు. ఈరోజు ఆమె మీడియతో మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో తామిచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని అన్నారు. ఏపీలో బీజేపీపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ఎవరేంటనే విషయం ప్రజలు బేరీజు వేసుకుంటారని అన్నారు. ఏపీలో భూగర్భ డ్రైనేజీకి ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేదని  విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆమె మాట్లాడుతూ, హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని అభిప్రాయపడ్డారు.
bjp
purandeswari

More Telugu News