Tollywood: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తొలి ఛార్జిషీట్ నమోదు

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్‌ కేసులో తొలి చార్జ్‌ షీట్ ను సిట్ దాఖలు చేసింది. టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ దందాపై ఐపీఎస్ అధికారి అకున్‌ సబర్వాల్‌ నేతృత్వంలోని సిట్‌ పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులను విచారించిన సంగతి తెలిసిందే.

వీరిలో ముగ్గురి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పరిశీలన నిమిత్తం పంపిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక రావడంతో వారిపై ఛార్జ్ సీటును సిట్ దాఖలు చేసింది. మరికొందరికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని, అది చేరిన తరువాత వారిపై మరో ఛార్జ్ షీట్ ను దాఖలు చేస్తామని అకున్ సబర్వాల్ తెలిపారు.
Go Back to Shorts
Tollywood
drugs
sit
charze sheet

More Telugu News