kadapa: కడప సబ్ జైలులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ ఆత్మహత్య

  • మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో సునీల్
  • పోలీసుల నుంచి పలుమార్లు తప్పించుకున్న నిందితుడు
  • రాయలసీమలో 19 కేసులు
కోర్టుకు తీసుకెళ్తుండగా పలుమార్లు తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ శుక్రవారం రాత్రి కడప సబ్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సునీల్‌పై రాయలసీమలో మొత్తం 19 కేసులున్నాయి. వీటితో పాటు పీడీ యాక్ట్‌ కూడా నమోదైంది. దీంతో భయపడిన అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

గత నెల 27న పోలీసులకు చిక్కిన సునీల్ కోర్టుకు తీసుకెళ్తుండగా మరోమారు తప్పించుకుని బెంగళూరు పారిపోయాడు. ఈసారి పక్కాగా ప్లాన్ చేసిన పోలీసులు బెంగళూరు వెళ్లి సునీల్‌ను అరెస్ట్ చేసి కడప సబ్ జైలుకు తరలించారు. ఈసారి తప్పించుకునే మార్గం లేకపోవడంతో మరో దారి లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సునీల్ ఆత్మహత్య విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
kadapa
Jail
suicide
Andhra Pradesh

More Telugu News