rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలుచోట్ల పవర్ కట్!

  • పలు ప్రాతాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా
  • రంగారెడ్డి జిల్లాలోనూ ఉరుములు, మెరుపులతో వర్షం
  • వాహనదారుల ఇక్కట్లు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మారేడ్‌ పల్లి, తుకారంగేట్, అడ్డగుట్ట, చిలకలగూడ, కార్ఖానా, బోయిన్‌ పల్లి, తిరుమల గిరి, అల్వాల్‌, సనత్ నగర్, ఎస్సార్ నగర్, యూసఫ్‌గూడ, మోతీనగర్, మాదాపూర్, గచ్చిబౌలి, సంతోష్ నగర్, చంపాపేట్, సైదాబాద్, మాదాపేట్, సరూర్ నగర్, తార్నాక, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్, మల్లాపూర్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్ పురా, చాంద్రాయణ గుట్ట, యాకుత్‌పురాలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. 
rain
Hyderabad

More Telugu News