BJP: బీజేపీ పాలనలో హింసాకాండ, అసహనం పెచ్చరిల్లుతున్నాయి!: రఘువీరారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
దేశంలో మత సామరస్యం కాంక్షిస్తూ అఖిల భార‌త‌ కాంగ్రెస్ క‌మిటీ ఆదేశాల మేర‌కు ఈ నెల 9న ఒక రోజు నిరాహారదీక్షకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దేశంలో పెచ్చరిల్లుతున్న హింసాకాండ, అసహనంకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులన్నీ ఈ నెల 9న ఒక రోజు నిరాహారదీక్ష కార్యక్రమంలో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌న్నారు.

బీజేపీ పాలనలో నేడు దేశవ్యాప్తంగా దళితులపైన, మైనార్టీలపైన జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలన్నారు. దేశంలో కుల, మత, సామరస్యాలను, శాంతిని నెలకొల్పాలని... పార్టీకి చెందిన నాయ‌కులు, కార్యక‌ర్త‌లు, అభిమానులు నిరాహారదీక్షలో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.
Go Back to Shorts
BJP
Congress
raghuveerareddy
Andhra Pradesh
India

More Telugu News