Pawan Kalyan: పవన్ కల్యాణ్ చేతిపై సీపీఎం మధు చొక్కా .. వీడియో చూడండి

  • విజయవాడలో మూడు పార్టీలు నిర్వహించిన పాదయాత్ర
  • చెమటలు పట్టడంతో చొక్కా తీసేసి బనియన్ తో ఉన్న మధు
  • ఆ చొక్కాను తన చేతిపై వేసుకున్న పవన్
ఏపీపై కేంద్రం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు విజయవాడలో ఈరోజు పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. బెంజి సర్కిల్ నుంచి జాతీయ రహదారి మీదుగా రామవరప్పాడు వరకూ సాగిన ఈ పాదయాత్రలో సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ,  జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

ఇక ఈ పాదయాత్రలో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. బాగా చెమటలు పట్టడంతో మధు తన చొక్కాను తీసేసి బనియన్ తోనే పాదయాత్ర కొనసాగించారు. మధు చొక్కాను పవన్ తన చేతిపై వేసుకుని కలిసి నడుచుకుంటూ వెళ్లడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
Pawan Kalyan
cpm madhu
Vijayawada

More Telugu News