బీజేపీ ఎంపీలంతా నిరాహారదీక్ష చేపట్టండి: మోదీ పిలుపు
- పార్లమెంటులో జరిగిన పరిణామాలకు నిరసనగా దీక్ష
- ఈ నెల 12వ తేదీన దీక్ష
- కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలు చేస్తోందన్న అనంత్ కుమార్
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే... కాంగ్రెస్ మాత్రం మోసపూరిత రాజకీయాలకు తెరలేపిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీలు, నేతలంతా నిరసన ప్రదర్శనలకు సిద్ధం కావాలని ప్రధాని పిలుపునిచ్చారని తెలిపారు.