వైసీపీ ఎంపీల ఆమరణదీక్ష ప్రారంభం
- రాజీనామాల అనంతరం ఆంధ్రాభవన్ కు చేరుకున్న ఎంపీలు
- వైయస్ ఫొటోకు నివాళి అర్పించి, దీక్ష ప్రారంభించిన నేతలు
- దీక్షాస్థలికి చేరుకుంటున్న వైసీపీ మద్దతుదారులు
దీక్ష చేపట్టిన ప్రాంగణం వద్ద దివంగత వైయస్ ఫొటోకు నివాళి అర్పించి దీక్షలో కూర్చున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దీక్ష ప్రారంభమైంది. దీక్షలో కూర్చున్న ఎంపీలకు సంఘీభావం తెలిపేందుకు పలువురు వైసీపీ మద్దతు దారులు అక్కడకు చేరుకున్నారు. వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అనంత వెంకట్రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు ఎంపీలతో పాటు వేదికపై కూర్చున్నారు.