Nara Lokesh: పవన్ నుంచి స్పందన లేదు.. అందుకే వదిలేశా: నారా లోకేష్

  • ఆరోపణలకు ఆధారాలు చూపాలని అడిగినా స్పందన లేదు
  • విచారణకు కూడా సిద్ధమని చెప్పా
  • కోర్టుకు వెళ్లడంలో జగన్ బిజీగా ఉన్నారు
వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ పవన్ కల్యాణ్ ను ఇప్పటికి 10 సార్లు అడిగానని ఆయన చెప్పారు. విచారణకు కూడా తాను సిద్ధమేనని అన్నానని... అయితే, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, తాను కూడా ఆ అంశాన్ని వదిలేశానని తెలిపారు.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై అటు పార్లమెంటులో, ఇటు రాష్ట్రంలో టీడీపీ పోరాడుతోందని లోకేష్ అన్నారు. రాష్ట్రం కోసం జగన్ పోరాడుతున్నట్టు తనకు ఎక్కడా కనిపించడం లేదని... అవినీతి కేసులకు సంబంధించి కోర్టుకు వెళ్లడంలో ఆయన బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు శుక్రవారం (జగన్ కోర్టుకు వెళ్లే రోజు) అని ఆయన గుర్తు చేశారు. 
Nara Lokesh
Jagan
Pawan Kalyan

More Telugu News