Salman Khan: సల్మాన్ ఎన్నో మంచి పనులు చేశాడు...శిక్ష పడడం బాధగా ఉంది: జయా బచ్చన్

  • సల్మాన్ కు శిక్షపై ఆందోళన వ్యక్తం చేసిన జయా బచ్చన్
  • సామాజికి సేవలో సల్మాన్ ముందుంటాడు
  • సల్మాన్ కు ఇంత కఠిన శిక్ష సరికాదు
ఎన్నో మంచి పనులు చేసిన సల్మాన్ ఖాన్ కు శిక్ష పడడం బాధగా ఉందని ఎంపీ జయా బచ్చన్ అన్నారు. కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కు జోధ్‌ పూర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, సామాజిక సేవలో సల్మాన్ ముందుంటాడని చెప్పారు. సల్మాన్ ఎన్నో మంచి పనులు చేశాడని చెప్పిన ఆమె, అతనికి ఇంత కఠిన శిక్ష బాధాకరమేనని అన్నారు. ఈ కేసులో న్యాయస్థానం కఠిన శిక్ష విధించకుండా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. 
Salman Khan
jaya baduri
jaya bacchan

More Telugu News