allu arjun: 'క్షణం' దర్శకుడితో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ?

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'నా పేరు సూర్య'
  • అల్లు అర్జున్ తాజా చిత్రంపై అభిమానుల ఆసక్తి 
  • రవికాంత్ పేరెపుతో చర్చలు
అల్లు అర్జున్ ఎప్పుడూ కూడా ఒక సినిమాపైనే పూర్తి దృష్టి పెడతాడు. దాని అవుట్ పుట్ విషయంలో సంతృప్తి చెందిన తరువాతనే ఆయన రిలీజ్ కి వెళ్లడానికి ఓకే చెబుతాడు. ముందుగా చేస్తోన్న సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగా ఆయన మరో సినిమాను సెట్ చేసుకుంటాడు. అలా 'నా పేరు సూర్య' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా, అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి సంబంధించిన వార్తలు బయటికి వస్తున్నాయి.

దర్శకుడు రవికాంత్ పేరెపు ..అల్లు అర్జున్ కి ఒక కథను వినిపిస్తున్నాడని అంటున్నారు.'క్షణం' సినిమాను రవికాంత్ తెరపై ఎలా ఆవిష్కరించాడో .. ఎంతటి సక్సెస్ ను అందుకున్నాడో అల్లు అర్జున్ కి తెలుసు. అందువలన ఆయనతో కథా చర్చలు జరుపుతున్నాడని చెబుతున్నారు. రవికాంత్ .. అల్లు అర్జున్ ను ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి మరి. ఇక మరో వైపున అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.      
allu arjun
ravikanth perepu

More Telugu News