nani: అమెరికాలో అత్యధిక థియేటర్స్ లో నాని మూవీ రిలీజ్

షార్ట్స్‌లో చూడండి
కథలను ఎంపిక చేసుకునే విషయంలో నానిని అగ్రకథానాయకులు సైతం మెచ్చుకుంటూ వుంటారు. కథలో కొత్తదనానికీ .. తనకి అది ఎంతవరకూ సెట్ అవుతుందనే విషయంలో నాని ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఈ కారణంగానే వరుస విజయాలను దక్కించుకుంటూ ఒక అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

అలా ఆయన తాజా చిత్రంగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కృష్ణార్జున యుద్ధం' సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేయడం విశేషం. నాని సినిమాలకి అమెరికాలోను మంచి మార్కెట్ వుంది .. అందువలన ఈ సినిమాను అక్కడ 600 స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారు. నాని కెరియర్లో అమెరికాలో ఈ స్థాయి రిలీజ్ ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఆయన గత చిత్రాలు అక్కడ సాధించిన వసూళ్లే ఈ స్థాయి రిలీజ్ కి కారణమని చెప్పుకుంటున్నారు.   
Go Back to Shorts
nani
anupama

More Telugu News