sri reddy: కేసీఆర్ గారూ, మీరు స్పందించకపోతే పబ్లిక్ లో నగ్నంగా నిలబడతా: హీరోయిన్ శ్రీరెడ్డి

  • సార్, మా బాధను అర్థం చేసుకోండి
  • మీరు పోరాడిన మార్గాన్నే నేను కూడా ఎంచుకున్నా
  • మిమ్మల్ని ఎలా కలవాలో కూడా తెలియడం లేదు
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక దాడులు, మోసాలపై హీరోయిన్ శ్రీరెడ్డి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీరంగంలోని పలువురి పేర్లను ఆమె పరోక్షంగా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో కల్పించుకుని, సినీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆమె విన్నవించింది. 

ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది. 'కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది.
sri reddy
KCR
Tollywood
sexual abuse

More Telugu News