Rahul Gandhi: గాల్లో ఎగురుతూ రాహుల్ గాంధీ మెడలో వచ్చి పడిన దండ... నటి దివ్య స్పందన షేర్ చేసుకున్న వీడియో చూడండి!

  • కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్న రాహుల్
  • సరిగ్గా మెడను అలంకరించిన అభిమాని విసిరిన దండ
  • విస్తుపోయి చూసిన రాహుల్
ప్రస్తుతం కర్ణాటకలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఓపెన్ టాప్ వ్యాన్ పై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ వెళుతున్న రాహుల్ పై గాల్లో ఎగురుతూ వచ్చిన ఓ పూలదండ, ఆయన మెడలో పడింది. తుమ్కూరు సమీపంలో ఈ ఘటన జరుగగా, ఎవరో అభిమాని విసిరిన దండ రాహుల్ మెడలో పడగా, విస్తుపోయిన రాహుల్, ఆ దండ వేసింది ఎవరా? అని చుట్టూ ఓసారి పరికించి చూశారు.ఆపై దండ వచ్చిన వైపు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

 ఈ వీడియోను కాంగ్రెస్ నేత, కన్నడ హీరోయిన్ దివ్య స్పందన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 'కర్ణాటకలో టాలెంట్ ఉంది' అని క్యాప్షన్ పెట్టారు. ఇక రాహుల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, ఎవరో విసిరిన దండ సరిగ్గా వచ్చి ఆయన మెడలో పడటంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరుగకుండా భద్రత పెంచాలని నిర్ణయించారు. రాహుల్ మెడలో పడుతున్న దండ వీడియోను మీరూ చూడండి.
Rahul Gandhi
Karnataka
Garland
Divya Spandana

More Telugu News