Donald Trump: రెండు నెలల మౌనాన్ని వీడిన డొనాల్డ్ ట్రంప్.. పోర్న్ స్టార్‌కు పేమెంట్‌పై పెదవి విప్పిన అధ్యక్షుడు

  • పదేళ్ల క్రితం పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్‌తో ట్రంప్ శృంగార కార్యకలాపాలు
  • బయటపెట్టకుండా 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్టు ఆరోపణలు
  • ‘నో’ అంటూ కొట్టిపడేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మౌనం వీడారు. పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్‌కు 1.30 లక్షల డాలర్లు ఇవ్వనే లేదని తేల్చి చెప్పారు. తన లాయర్ ద్వారా ఆమెకు డబ్బులు చెల్లించినట్టు వస్తున్న వార్తలను ఆయన ‘నో’ అంటూ కొట్టిపడేశారు.

స్టార్మీ డేనియల్స్ పేరుతో నటించే పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్ తనకు ట్రంప్ 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్టు సంచలన ఆరోపణలు చేసింది. దశాబ్దం క్రితం ఇద్దరి మధ్య జరిగిన శృంగార కార్యకలాపాలను బయటపెట్టకుండా నోరు మూసేందుకు ఆయన ఆ సొమ్మును తన లాయర్ ద్వారా పంపినట్టు పేర్కొని కలకలం రేపింది.

క్లిఫోర్డ్‌కు తాను డబ్బులు చెల్లించిన మాట వాస్తవమేనని ట్రంప్ వద్ద సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న లాయర్ మైఖేల్ కోహెన్ అంగీకరించారు. అయితే ఆ సొమ్మును ఎందుకు ఇచ్చిందీ ఆయన వెల్లడించలేదు. అయితే, క్లిఫోర్డ్‌కు తన లాయర్ కోహెన్ డబ్బులు చెల్లించినట్టు తనకు తెలియదని ట్రంప్ పేర్కొన్నారు. ఆ విషయాన్ని ఆయన్నే అడిగి తెలుసుకోవాలని సూచించారు. కోహెన్ తన అటార్నీ అని పేర్కొన్నారు.
Donald Trump
america
Michael Cohen
Stephanie Clifford

More Telugu News