Commonwealth Games: రెండో స్వర్ణం... 192 కేజీలు ఎత్తి స్వర్ణం ఎగరేసుకుపోయిన సంజిత చాను!

  • కామన్వెల్త్ క్రీడల్లో మరో స్వర్ణం
  • మరో పసిడిని జమ చేసిన సంజిత చానూ
  • రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల పోటీల్లో నిన్న మీరాబాయి చానూ, రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, నేడు సంజిత చానూ మరో పసిడి పతకాన్ని భారత ఖాతాకు జమ చేసింది. 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఏకంగా 192 కేజీల బరువును ఆమె ఎత్తింది. స్నాచ్ రౌండ్ లో మూడు అటెంప్ట్ లలో విజయం సాధించిన ఆమె, క్లీన్ అండ్ జర్క్ విభాగం మూడో అటెంప్ట్ లో విఫలమైనప్పటికీ, ఆమెకు సమీపంలోనే ఉన్న పపువా న్యూ గినియా వెయిట్ లిఫ్టర్ సైతం క్లీన్ అండ్ జర్క్ థర్డ్ అటెంప్ట్ లో ఫెయిల్ కావడంతో, స్వర్ణ పతకం భారత్ కైవసమైంది. మీరాబాయి చానూ సరసన నిలిచిన సంజితపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Commonwealth Games
India
Sanjita Chanu
Gold Medal

More Telugu News