iyr: ఐవైఆర్ లాంటి దుష్టశక్తులను తరిమికొట్టాలి : వర్ల రామయ్య

  • ‘ప్రజా రాజధానిపై కుట్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వర్ల
  • ఇద్దరు అవినీతిపరుల కబంధ హస్తాల్లో ఐవైఆర్ చిక్కుకుపోయారు
  • పవన్ కల్యాణ్ పరిపక్వతలేని చిన్నపిల్లోడు
మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లాంటి దుష్టశక్తులను తరిమికొట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ‘ప్రజా రాజధానిపై కుట్ర’ పుస్తకాన్ని నవ్యాంధ్ర రైతులు ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వర్ల రామయ్య మాట్లాడుతూ, గతంలో అమరావతిని పొగిడిన ఐవైఆర్, రిటైర్ అయిన తర్వాత ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇద్దరు అవినీతిపరుల కబంధ హస్తాల్లో ఐవైఆర్ చిక్కుకుపోయారని, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిపక్వతలేని చిన్నపిల్లోడని విమర్శించారు. సీఎం చంద్రబాబు కష్టపడి రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని, ఆయనపై నమ్మకంతో రైతులు ముప్పైమూడు వేల ఎకరాలను ఇచ్చారని అన్నారు. రైతులు త్యాగాన్ని చంద్రబాబు వృథా కానివ్వరని, రాజధానిపై ఎవరు కుట్రలు చేసినా తిప్పికొడతామని హెచ్చరించారు. 
iyr
varla ramaiah
Pawan Kalyan

More Telugu News